 
															పంటలన్నీ వర్షార్పణం
మోంథా తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు సంగారెడ్డి జిల్లాలో పంటలన్నీ వర్షార్పణం అయ్యాయి. అసలే రైతులు అతివృష్టి కారణంగా
కుదేలయ్యారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈ తుపాను మళ్లీ రైతులను నిండా ముంచింది. కోతకు వచ్చిన వరిపొలాలు నేలకొరిగి నీళ్ళల్లో మురుగుతున్నాయి. పత్తిచేలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. కొంతమంది రైతులు కూరగాయలు వేసుకుంటే వరద ధాటికి నీళ్లు ప్రవహించి పొలాలు మైదానంలా మారాయి.
సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
