విద్యార్థులు నైపుణ్యం సంపాదించాలి
సిద్దిపేటఎడ్యుకేషన్: విద్యార్థులు సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అధునాతన నైపుణ్యాలను సంపాదించుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్‌కుమార్ అన్నారు. సైబర్ భద్రత సవాళ్లు, దృక్పథాలు అనే అంశంపై సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో నిర్వహించిన రెండ్రోజుల జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఒక దేశం బలం ఆదేశం డేటా దాని నియంత్రణలో ఉంటుందని, చైనా మినహా దాదాపు అన్ని దేశాల నుంచి గూగుల్ డేటాను కలిగి ఉన్నట్లు చెప్పారు. ఉచిత డిజిటల్ సేవలకు ఆకర్షితులైతే సైబర్ నేరాలకు అవకాశం ఉంటుందని సూచించారు. సైబర్ మోసాలకు పేరుగాంచిన ప్రముఖ వెబ్‌సిరీస్‌ను ప్రస్తావిస్తూ విద్యార్థులు వాస్తవాలను తెలుసుకోవాలన్నారు. సంప్రదాయ ఐటీ రంగంలో నైపుణ్యాలు ఉంటే ఆశాజనకమైన కెరీర్ అవకాశాలను అందిపుచ్చుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సునీత, వైస్ ప్రిన్సిపాల్ అయోధ్యరెడ్డి, సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్‌రెడ్డి, సీఓఈ గోపాలసుదర్శనం, సదస్సు కన్వీనర్లు పాల్గొన్నారు.
పోలీస్ కమిషనర్ విజయ్‌కుమార్
ముగిసిన జాతీయ సదస్సు


