ఎర్రరాయి తవ్వకాలపై దాడులు
న్యాల్‌కల్(జహీరాబాద్): మండల పరిధిలోని గణేశ్‌పూర్ గ్రామ శివారులో అక్రమంగా కొనసాగుతున్న ఎర్ర రాయి తవ్వకాలపై రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. ఒక ఇటాచీని స్వాధీనం చేసుకున్నారు. శనివారం జహీరాబాద్ ఆర్డీఓ దేవూజీ, రెవెన్యూ అధికారులు శ్యామ్‌రావు సిబ్బందితో కలిసి గణేశ్‌పూర్ గ్రామ శివారులో ఎర్ర రాయి తవ్వకాలపై దాడులు నిర్వహించారు. దాడి విషయం ముందుగానే తెలుసుకున్న తవ్వకాల నిర్వాహకులు వాహనాలతో పరారయ్యారు. తవ్వకాల వద్దకు వెళ్లిన అధికారులు అక్కడ ఎవ్వరు కనిపించకపోవడంతో పరిసరాలను పరిశీలించారు. అక్కడ ఉన్న ఇటాచీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ దేవూజీ మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఎర్ర రాయి తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇటాచీని స్వాధీనం చేసుకున్న అధికారులు


