అక్రమ కల్లు దుకాణాలపై దాడులు
అల్లాదుర్గం(మెదక్): కల్తీ కల్లు విక్రయిస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మండలంలోని చిల్వెర గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎకై ్సజ్ ఎస్‌ఐ రాజేశ్ వివరాల ప్రకారం... గ్రామ శివారులో 161 జాతీయ రహదారి పక్కన అక్రమంగా కొంత కాలంగా కల్లు దుకాణాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి లైసెన్సులు లేకుండా చిల్వెర గ్రామానికి చెందిన ప్రభుగౌడ్, మహేశ్ గౌడ్, సత్యనారాయణ కల్తీ కల్లు విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు చేశారు. 110 లీటర్ల కల్తీ కల్లును పారబోసి, ముగ్గురిపై కేసు నమోదు చేశారు. రోడ్ల పక్కన , జాతీయ రహదారుల పక్కన అక్రమంగా కల్లు విక్రయిస్తే కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు హెచ్చరించారు.
ముగ్గురిపై కేసు నమోదు


