మేకప్‌తో మెరిసేద్దాం
ప్రభుత్వం తరఫున
ఉచిత శిక్షణ
రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలువురికి జహీరాబాద్‌లో లతాస్ బ్యూటీ అకాడమీలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పూర్తయిన వారికి సర్టిఫికెట్స్‌ను కూడా అందిస్తున్నారు. కొందరు సొంతంగా పార్లర్లను ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతుండగా, మరికొందరు ఫ్రీలాన్సర్స్‌గా మేకప్, మెహిందీ, ఫ్లవర్ మేకింగ్, శారీ ఫ్రీ ప్లీటింగ్ ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకుని ఎదుగుతున్నారు. ఈ కోర్సు నేర్చుకోవడం వల్ల నిరుద్యోగులైన యువతులే కాకుండా గృహిణులు కూడా ఉపాధి పొందుతున్నారు.
అందం ఉట్టిపడేలా..
పెళ్లి కుమార్తె అందం ఉట్టి పడేలా తీర్చిదిద్దుతున్నారు. ముఖంపై మొటిమలు కనిపించకుండా కవర్ చేసుకునేలా చూస్తున్నారు. పెదవులు, కళ్లు, జడను అందంగా మేకోవర్ చేస్తున్నారు. పెళ్లి ఫొటోల్లో చక్కగా కనిపించేలా మేకప్‌కు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు.
– లత, ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు, జహీరాబాద్
ఏ శుభకార్యమైనా ముస్తాబవ్వాల్సిందే!
డ్రెస్సింగ్, మేకప్‌లకు ప్రాధాన్యత
మహిళల్లో పెరుగుతున్న ఆసక్తి
గ్రామాలకూ విస్తరించిన బ్యూటీ పార్లర్లు
ఉపాధి పొందుతున్న యువతులు
మేకప్‌తో మెరిసేద్దాం
మేకప్‌తో మెరిసేద్దాం
మేకప్‌తో మెరిసేద్దాం


