ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణలతో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు. మన ఊరు–మన బడి పథకం ద్వారా రూ.67 లక్షలతో నిర్మించిన 4 అదనపు తరగతి గదులు, ఆర్డీసీ కాంక్రీట్ ఇండస్ట్రీస్ సీఎస్‌ఆర్ నిధులు రూ.10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన మరో రెండు అదనపు తరగతి గదులు ప్రారంభించారు. అయితే ప్రభుత్వం అందించే నిధులతో పాటు వివిధ పరిశ్రమల సహాయ సహకారాలతో నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, ఎంఈఓ నాగేశ్వరరావు నాయక్, పంచాయతీరాజ్ డీఈ సురేష్, ప్రమోద్ గౌడ్, ఆర్డీసీ పరిశ్రమ ప్రతినిధి నరేష్, ఉపాధ్యా యులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్
పోటీలకు విద్యార్థుల ఎంపిక
నారాయణఖేడ్: మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు ఇర్ఫాన్, శానవాజ్, ఆజన్, ఫయాజ్ రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గణపతి తెలిపారు. జిల్లాలోని గిర్మాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల గ్రౌండ్‌లో నిర్వహించిన అండర్ –19 ఉమ్మడి మెదక్ జిల్లా ఎస్‌జీఎఫ్ హ్యాండ్‌బాల్ క్రీడల్లో ప్రతిభచాటారన్నారు. ఎంపికై న విద్యార్థులను గణపతితోపాటు గురుకుల ప్రదానోపాధ్యాయులు రాములు, పీఈటీ అజీజ్, సంతోష్, ధన్‌రాజ్, ఉపాధ్యాయులు సిబ్బంది, తోటి విద్యార్థులు అభినందించారు.
బెస్ట్ అవైలబుల్
బకాయిలు చెల్లించండి
కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అశోక్
సంగారెడ్డి ఎడ్యుకేషన్: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు సంబంధించిన బకాయిలు చెల్లించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అశోక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం అశోక్ మాట్లాడుతూ.. ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కీం డబ్బులు చెల్లించకపోవడంతో దళిత, గిరిజన విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు సంవత్సరాల నుంచి రూ.130 కోట్ల పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలకు డబ్బులు రానందున అందులో చదువుతున్న విద్యార్థులు చదువును కొనసాగించలేకపోతున్నారని వాపోయారు. వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు ప్రస్తుతం ఇంటికే పరిమితం అవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజు, నర్సింలు, మల్లేశం, సహాయ కార్యదర్శి జయరాం, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ఆన్‌లైన్‌లో వ్యాసరచన పోటీలు
ఎస్పీ పరితోష్ పంకజ్
సంగారెడ్డి జోన్: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆన్‌లైన్ విధానంలో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 21న పోలీసు అమరవీరుల దినోత్సవంలో భాగంగా ఆరో తరగతి నుంచి పీజీ చదువుతున్న విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషలలో 500 పదాలకు మించకుండా రాసి పంపాలన్నారు. కాగా, పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజావాణిలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్పీ సూచించారు. సోమవారం ప్రజల నుండి వినతులు స్వీకరించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య


