తడిసి ముద్దయింది..
నారాయణఖేడ్: ఈ వర్షాకాలంలో అతి భారీ వర్షాలు కురిశాయి. జిల్లాలో సాధారణం కంటే అధికంగా వర్షం కురవడంతో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ఈ సీజన్ రైతన్నకు నష్టాన్నే మిగిల్చింది. జూన్ మాసంలో లోటు వర్షపాతం కురిసి.. తర్వాల నెలల నుంచి దంచి కొట్టింది. ప్రతీ నెలలోనూ అధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలో జూన్‌లో 121 మి.మీ వర్షపాతం నమోదు కాగా, 53 మి.మీటర్లు మాత్రమే కురిసింది. జూలైలో 191 మి.మీకు గాను 205 మి.మీటర్లు కురిసి 14మి.మీ అధికంగా, ఆగస్టులో 191మి.మీటర్లకు గాను 441మి.మీ కురిసింది. సెప్టెంబర్‌లో 162 మి.మీటర్లు కురియాల్సి ఉండగా 246 మి.మీ కురిసి 84మి.మీ అధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలో సాధారణంగా 544 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకు మించి 892 మిల్లి మీటర్ల వర్షపాతం కురిసింది. అంటే మూడు నెలల కాలంలో 348 మిల్లీమీటర్ల వర్షం అధికంగా కురిసింది. భారీ వర్షాల వల్ల పెసర, మినుము పంటలు వంద రోజుల్లో చేతికి వస్తుంది. ఈ సమయంలో అధిక వర్షాల వల్ల నాని దెబ్బతింది. మార్కెట్‌లో పెసర, మినుము పంటలకు ధర లేకుండా పోయింది.
అధిక వర్షాలతో నష్టం
అధికంగా, నిరంతరాయంగా వర్షాలు కురియడం వల్ల పంటలకు నష్టం వాటిల్లుతుందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. పొ లంలో నీరు నిలవడం వల్ల వేర్లకు ఆక్సిజన్ కొరత ఏర్పడటం, నేల లోని గాలి ఖాళీలు నీటితో నిండిపోయి వేర్లకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుంది. వేర్లు కుళ్లిపోయాయి. అధిక వర్షాల వల్ల నీటిలోని పోషకాలు కొట్టుకుపోవడం వల్ల మొక్కకు పోషక పదార్థాలు అందకుండా పోతాయి. స్వల్ప కాలికాలైన పెసర, మినుము పంటలు వర్షం వల్ల నాని దెబ్బతిన్నాయి. పెసర, మినుము ఎకరంలో 6 నుంచి 8 క్వింటాళ్లు దిగుబడి రావాల్సి ఉండగా మూడు క్వింటాళ్ల వరకు మాత్రమే వచ్చిందని రైతులు పేర్కొంటున్నారు. పంట నానడం వల్ల మార్కెట్‌లో ధర లేకుండా పోయింది. కంది పంటకు వేరు కుళ్లు తెగులు సోకుతోంది. దీంతో దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపనుంది. సోయా పంట నీరు నిలువడం వల్ల కాయలు పగిలి గింజలు రాలిపోనున్నాయి. మొక్కజొన్న సున్నితమైన పంట కావడం..నీరు నిలువడం వల్ల కాండం కుళ్లు తెగులు, వేరు కుళ్లు తెగులు, చీడపీడల సమస్య అధికంగా ఉండనుంది.
మూడు నెలల్లో సాధారణం కంటే అధికంగా 348 మి. మీ వర్షపాతం
పంటలపై తీవ్ర ప్రభావం
దిగుబడులు నష్టపోతున్న రైతులు
సాధారణం 544 మి.మీ
కురిసింది 892 మి.మీ
అధికంగా 348 మి.మీ


