మీ మద్దతు ఎవరికి..?
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవి నియామక ప్రక్రియలో భాగంగా ఏఐసీసీ పరిశీలకులు ఝరిత ఆ పార్టీ నాయకులతో అభిప్రాయ సేకరణ చేపట్టారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలతో కలిసి సోమవారం సంగారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులతో సమావేశమయ్యారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, పట్టణ, మండలాల అధ్యక్షులు, వివిధ విభాగాల బాధ్యులతో ముఖాముఖి నిర్వహించి అభిప్రాయ సేకరణ చేశారు. డీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తే బాగుంటుందని ఆరా తీశారు. ఈ సందర్బంగా ఝరిత మాట్లాడుతూ డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఆసక్తి ఉన్న నాయకులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. డీసీసీ పదవుల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా, 50 ఏళ్లలోపు ఉన్న వారికి 50 శాతం రిజర్వేషన్ ఉంటుందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో డీసీసీ అధ్యక్ష పదవి కీలకం కాబోతుందని, ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీతో డీసీసీ అధ్యక్షులు నేరుగా మాట్లాడే అవకాశం ఉంటుందని అన్నారు.
డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై
అభిప్రాయ సేకరణ
కాంగ్రెస్ నేతలతో
ఏఐసీసీ పరిశీలకులు భేటీ


