
బోరంచలో నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు
నారాయణఖేడ్: దేవీశరన్ననవరాత్రి ఉత్సవాలు మనూరు మండలంలోని సుప్రసిద్ధ బోరంచ నల్లపోచమ్మ దేవస్థానంలో ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఆలయాన్ని ముస్తాబు చేశారు. ఈనెల 22వ తేదీ నుంచి వచ్చేనెల 2వ వరకు ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతాయని ఆలయ ప్రధానార్చకులు సిద్దుస్వామి, నగేశ్‌స్వామి ఆదివారం వెల్లడించారు. అమ్మవారు భక్తులకు రోజుకోరూపంలో దర్శనమిస్తారని చెప్పారు. సోమవారం పాఢ్యమి నాడు అమ్మవారు బాలా త్రిపురాసుందరీట వీగా దర్శనమివ్వనున్నట్లు తెలిపారు. అమ్మవారిని నిత్యం కుంకుమార్చన, ప్రత్యేక అభిషేకం, మహానైవేద్యం, నిత్య అన్నదానం కార్యక్రమాలు జరగనున్నాయి. మహోత్సవాలు, ఒక్కోరోజు అభిషేకం, అలంకరణ, కుంకుమార్చన, అన్నదానంకు భక్తులు 81799 76606, 99499 71150, 80960 46076, 99480 56415 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
ఇబ్బందుల్లేకుండా నీటి సరఫరా చేయండి
ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: గ్రామాలు, తండాలకు తాగునీటి ఇబ్బందులు ఏర్పడకుండా తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డా.సంజీవరెడ్డి అధికారులకు సూచించారు. నాగల్‌గిద్ద మండలం గుడూరు గ్రామంలో మంజీరా నదిపై ఉన్న 4 ఎంఎల్‌డీ నీటిశుద్ధి ప్లాంట్‌ను, పంప్‌హౌజ్‌ను ఆదివారం ఎమ్మెల్యే సందర్శించారు. పంప్‌హౌజ్‌లో మోటార్ల పనితీరును పరిశీలించి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా చూడాలని సూచించారు. నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల మిషన్ భగీరథ పైపులు, పంపు మోటారు చెడిపోయి నీటి సరఫరాకు అంతరాయమేర్పడిందని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వాటికి మరమ్మతులు చేపట్టామని, ఇక ముందు నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. సమస్యలు ఉన్న పక్షంలో తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.
బాగా చదివి పేదలకు
వైద్యసేవలందించాలి
విద్యార్థి దినేశ్ నాయక్‌కు సన్మానంలో
హరీశ్‌రావు
నారాయణఖేడ్: విజయవంతంగా వైద్యవిద్యను పూర్తి చేసి పేదలకు సేవలందించాలని ఇటీవల ఎంబీబీఎస్‌లో సీటు సాధించిన రాథోడ్ దినేశ్ నాయక్‌కు మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు. ఖేడ్ మండలం పలుగు తండాకు చెందిన రాథోడ్ దినేశ్ నాయక్ సిద్దిపేట మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటును సాధించాడు. తండ్రి రాథోడ్ పండిత్‌నాయక్ ఆటో నడుపుతుండగా తల్లి ధూరిబాయి వ్యవసాయ కూలిపనులు చేస్తుంది. ఆదివారం దినేశ్ నాయక్ ఖేడ్ తాజా మాజీ జెడ్పీటీసీ రవీందర్ నాయక్, ర్యాకల్, పలుగు తండాలకు చెందిన నాయకులు గోపాల్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, నెహ్రునాయక్, నితిన్ నాయక్‌లతో కలిసి హైదరాబాద్‌లోని మాజీమంత్రి హరీశ్‌రావు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా దినేష్ నాయక్‌ను హరీశ్‌రావు సన్మానించారు.

బోరంచలో నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు

బోరంచలో నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు