
ఆక్రమణలు తొలగించండి
హైడ్రా కమిషనర్, నీటి పారుదల శాఖ
ఉన్నతాధికారులకు ఎమ్మెల్యే వినతి
పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పాశమైలారం గ్రామ పరిధిలో గల ఆరు కుంటల భూమి ఆక్రమణకు గురి కావడంతో వీటిపై ఆధారపడిన మత్స్యకారుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని..వెంటనే ఆక్రమణలు తొలగించి చేపల పెంపకానికి అనువుగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కోరారు. ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తోపాటు నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ అహ్మద్ హుస్సేన్‌ను హైదరాబాద్‌లోని ఆయా కార్యాలయాల్లో శుక్రవారం కలసి వినతిపత్రం సమర్పించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన అధికారులు వెంటనే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.