
రీయింబర్స్‌మెంట్
బకాయిలు చెల్లించండి
నారాయణఖేడ్: పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్స్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఖేడ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...గత 18 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తున్నా గత ప్రభుత్వం చేసిన పొరపాట్లనే చేస్తూ విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.8 వేల కోట్లను పెండింగ్‌లో పెట్టడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలన్నారు.