బగలాముఖీని దర్శించుకున్న న్యాయమూర్తి | - | Sakshi
Sakshi News home page

బగలాముఖీని దర్శించుకున్న న్యాయమూర్తి

Jul 14 2025 5:03 AM | Updated on Jul 14 2025 5:03 AM

బగలామ

బగలాముఖీని దర్శించుకున్న న్యాయమూర్తి

శివ్వంపేట(నర్సాపూర్‌): మండల కేంద్రంలో కొలువైన బగలాముఖీ శక్తి పీఠాన్ని శనివారం జిల్లా న్యాయమూర్తి నీలిమ దర్శించుకున్నారు. ఈసందర్భంగా వేద పండితుడు శాస్త్రుల వెంకటేశ్వరశర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపిక అందజేశారు. శక్తిపీఠం విశిష్టత, నిర్మాణం గురించి న్యాయమూర్తికి వివరించారు. కార్యక్రమంలో పబ్బ రమేష్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.

42 శాతం రిజర్వేషన్లు

చరిత్రాత్మకం

నర్సాపూర్‌: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డిలు అన్నారు. శనివారం పార్టీ క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌, మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్‌, పొన్నం ప్రభాకర్‌ చిత్రపటాలకు నాయకులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో బీసీ వర్గాల్లో ఆనందం నెలకొందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ సుహాసినిరెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

కాయకల్ప పురస్కారానికి ఖేడ్‌ ఆస్పత్రి ఎంపిక

నారాయణఖేడ్‌: 2024– 25 సంవత్సరానికి ఖేడ్‌ ప్రాంతీయ ఆస్పత్రిని కాయకల్ప పురస్కారానికి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రమేశ్‌ శనివారం తెలిపారు. ఆస్పత్రిలో ఉన్నత ప్రమాణాలతో అందిస్తున్న నాణ్యమైన ఆరోగ్యసేవలు, పరిశుభ్రత తదితర వాటికి సంబంధించి ఈ పురస్కారానికి ఎంపికై నట్లు చెప్పారు. ఆస్పత్రి అభివృద్ధి సంస్థ చైర్మన్‌, ఎమ్మెల్యే సంజీవరెడ్డి మద్దతు, ఎంపీ సురేష్‌ షెట్కార్‌ సహకారం, సిబ్బంది అంకిత భావంతో పనిచేస్తుండటం వల్లే ఇది సాధ్యమైందని వివరించారు.

విద్యార్థులు కష్టపడి చదవాలి

పటాన్‌చెరు టౌన్‌: విద్యార్థులు కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని ఇంటర్మీడియెట్‌ జిల్లా అధికారి గోవిందరావు అన్నారు. శనివారం అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని పటేల్‌గూడలో ఐఐటీ చుక్కా రామయ్య ఇష్టా జూనియర్‌ కళాశాల ఫ్రెషర్స్‌ డే వేడుకలను ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుట్టినప్పుడు ఉయ్యాల్లో వేస్తారు, చనిపోయినప్పుడు నలుగురు మోస్తారు. ఈ మధ్యలో మనం ఏదో చేయాలనే తపన ఏర్పడాలన్నారు. అనంతరం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఇంటర్‌ దశలోనే మంచి గోల్‌ పెట్టుకొని కష్టపడితే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని అన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ చదువు మీద దృష్టి పెట్టాలని సూచించారు.

ఏడాది పాటుసీపీఐ వందేళ్ల ఉత్సవాలు

హుస్నాబాద్‌: సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ చేసిన త్యాగాలు, పోరాటాలు, ప్రజాఉద్యమంలో సాధించిన విజయాలపై ఏడాదిపాటు సీపీఐ వందేళ్ల ఉత్సవాలను నిర్వహించనున్నట్లు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు.

బగలాముఖీని దర్శించుకున్న న్యాయమూర్తి 
1
1/1

బగలాముఖీని దర్శించుకున్న న్యాయమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement