
అన్నిరంగాల్లో అభివృద్ధి: దామోదర
సంగారెడ్డిజోన్: ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. శనివారం సంగారెడ్డిలోని తన నివాసంలో ఆందోల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను దశలవారిగా అమలు చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, రైతు భరోసా, భూ భారతి, రైతు రుణమాఫీ, రైతు బీమాను అమలు చేయడంతో పాటు పెన్షన్లు, కొత్త రేషన్‌కార్డుల జారీ, సన్నబియ్యం, ధాన్యం కొనుగోళ్లు, సన్నాలకు రూ. 500 బోనస్ అమలు చేస్తున్నామని వివరించారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. ఆందోల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతానని పేర్కొన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్‌కుమార్ షెట్కార్, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు సంగమేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, సిలారపు త్రిష, పీసీసీ సభ్యుడు కిషన్, ఏఎంసీ చైర్మన్లు సుధాకర్‌రెడ్డి, జగన్మోహన్‌రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్లు మల్లారెడ్డి, కచూర్‌రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, వివిధ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు దిగంబరరావు, శేషారెడ్డి, రమేష్, నిమ్మ రమేష్ తదితరులు పాల్గొన్నారు.