స్నాతకోత్సవానికి వేళాయె.. | - | Sakshi
Sakshi News home page

స్నాతకోత్సవానికి వేళాయె..

Jul 1 2025 7:27 AM | Updated on Jul 1 2025 7:27 AM

స్నాత

స్నాతకోత్సవానికి వేళాయె..

నేడు కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం సంబురాలు

ఏర్పాట్లు చేశాం

రాజేంద్రనగర్‌ ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నాలుగో స్నాతకోత్సవం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. 267 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందజేయనున్నాం. రోజురోజుకు పెరుగుతున్న ఉద్యాన పంటల విస్తీర్ణం నేపథ్యంలో విద్యార్థులకు ఈ రంగంలో ఉజ్వల భవిష్యత్తు ఉంది. విశ్వవిద్యాలయంలో పరిశోధనల(రీసెర్చ్‌)లో విస్తృత అవకాశాలున్నాయి. విశ్వవిద్యాలయానికి సమీపంలో ఉన్న కొట్యాల బోధన కళాశాలలో వాణిజ్యపరమైన ఉద్యాన పంటల మోడల్‌ ఉద్యాన క్షేత్రాన్ని ఏర్పాటు చేయనున్నాం. ప్రభుత్వం ఉద్యాన పంటల సాగుకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తోంది.

–డాక్టర్‌ దండా రాజిరెడ్డి,

విశ్వవిద్యాలయం, వైస్‌ ఛాన్స్‌లర్‌

కార్యక్రమానికి హాజరుకానున్న గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ

పట్టాలు అందుకోనున్న 267 మంది విద్యార్థులు

ములుగు(గజ్వేల్‌): నిత్యం విద్యార్థులు వివిధ అధునాతన పరిశోధన అంశాలపై సందడిగా కనిపించే సిద్దిపేట జిల్లా ములుగులోని కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నాలుగో స్నాతకోత్సవ సంబురానికి సిద్ధమైంది. మంగళవారం హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో స్నాతకోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, పటాన్‌చెరు ఇక్రిసాట్‌ డైరెక్టర్‌ జనరల్‌ హిమాన్షు పాఠక్‌ హాజరు కానున్నారు.

2014లో విశ్వవిద్యాలయం ఏర్పాటు

శ్రీ కొండా లక్ష్మణ్‌ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం (ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూ) 2014లో హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేశారు. 2019లో సిద్దిపేట జిల్లాలోని ములుగులో అప్పటి సీఎం కేసీఆర్‌ చేతులమీదుగా ప్రారంభమైంది. ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూకు అనుబంధంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 పరిశోధన స్థానాలు, 4 బోధన కళాశాలలు, ఒక కృషి విజ్ఞానకేంద్రం, మూడు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఏర్పాటు చేసిన ఈ విశ్వవిద్యాలయం తనదైన శైలిలో ఇప్పటికే అనేక విజయాలను సాధించింది. విద్యాబోధన, విస్తరణ పరిశోధన రంగాల్లో విశ్వవిద్యాలయం కృషి చేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు, రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీలు, ప్రభుత్వ , ప్రైవేట్‌ సంస్థలు, శాసీ్త్రయ సంస్థలతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుని ముందుకు సాగుతున్నారు. ఉద్యాన విద్య, విస్తరణ పరిశోధనలకు ఆదరణ పెరుగుతోంది. ఈ రంగంలో అపారమైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఉండటంతో అధిక శాతం విద్యార్థులు ఉద్యాన బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ కోర్సులు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

నాలుగో స్నాతకోత్సవం

విశ్వవిద్యాలయ మొదటి స్నాతకోత్సవం హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో నిర్వహించారు. రెండో స్నాతకోత్సవాన్ని ములుగు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో, మూడో స్నాతకోత్సవాన్ని ములుగు అటవీ కళాశాల, పరిశోధన కేంద్రం ఆడిటోరియంలో చేశారు. నాలుగో స్నాతకోత్సవాన్ని రాజేద్రనగర్‌లో నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో 267 మంది విద్యార్థులు గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ చేతుల మీదుగా డిగ్రీ పట్టాలను అందుకోనున్నారు. అందులో 158 మంది బ్యాచిలర్స్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌, 55 మంది బ్యాచిలర్స్‌ ఆఫ్‌ ఫారెస్ట్రీ, 38 మంది మాస్టర్స్‌ హార్టికల్చర్‌, 11 మంది మాస్టర్స్‌ ఫారెస్ట్రీ, 5 మంది పీహెచ్‌డీ హార్టికల్చర్‌ విద్యార్థులకు పట్టాలు అందజేయనున్నారు. అలాగే 13 మందికి గోల్డ్‌ మెడల్స్‌ను ప్రదానం చేయనున్నారు.

స్నాతకోత్సవానికి వేళాయె..1
1/2

స్నాతకోత్సవానికి వేళాయె..

స్నాతకోత్సవానికి వేళాయె..2
2/2

స్నాతకోత్సవానికి వేళాయె..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement