మెడికల్‌ షాపు ఎదుట సొంత ఖర్చుతో.. | - | Sakshi
Sakshi News home page

మెడికల్‌ షాపు ఎదుట సొంత ఖర్చుతో..

May 4 2025 8:12 AM | Updated on May 4 2025 8:12 AM

మెడికల్‌ షాపు ఎదుట సొంత ఖర్చుతో..

మెడికల్‌ షాపు ఎదుట సొంత ఖర్చుతో..

జహీరాబాద్‌ టౌన్‌: జహీరాబాద్‌ పట్టణానికి చెందిన రతన్‌ సరడా ఒక్కడే ఆరేళ్ల నుంచి చలి వేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. పట్టణంలోని భవానీ మందిరం రోడ్డులో రద్దీ ఎక్కువగా ఉంటుంది. వేసవిలో ఈ ప్రాంతానికి వచ్చిన వారికి మంచి నీళ్లు అందించాలన్న ఉద్దేశ్యంతో తన మెడికల్‌ షాపు ఎదుట చలివేంద్రం ఏర్పాటు చేసి కూలింగ్‌ మినరల్‌ వాటర్‌ అందిస్తున్నట్లు తెలిపారు. రెండేళ్లుగా ప్రతీ ఆదివారం నగర సంకీర్తన నిర్వహిస్తున్నామని, అందుకని ఈ సంవత్సరం చలివేంద్రాన్ని నగర సంకీర్తన పేరు పెట్టామన్నారు. పరిస్థితుల బట్టి అవసరం మేరకు కూలింగ్‌ వాటర్‌ బాటిల్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement