
వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం
ఇంటి నుంచి బయటకు వెళ్లి వ్యక్తి
పటాన్‌చెరు టౌన్: ఇంటి నుంచి బయటకు వెళ్లి వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఎస్‌ఐ కోటేశ్వర్ రావు కథనం మేరకు.. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని సింపోని పార్క్ హోమ్స్‌కు చెందిన కిరణ్ కుమార్ గత నెల 28న ఇంటి నుంచి స్కూటీ తీసుకొని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ వచ్చింది. కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. భర్త అదృశ్యంపై భార్య అనిత గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
పనికెళ్లి మరో వ్యక్తి
మెదక్ మున్సిపాలిటీ: మెదక్ వెంకట్రావునగర్ కాలనీకి చెందిన 38 ఏళ్ల షేక్ మౌలానా గత నెల 29 నుంచి కనిపించకుండా పోయినట్లు పట్టణ పోలీసులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మేసీ్త్రగా పని చేసే మౌలానా పని కోసమే వెళ్లి తిరిగి రాలేదని అతడి భార్య సీమా ఫాతిమా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పటాన్‌చెరులో వివాహిత
పటాన్‌చెరు టౌన్: వివాహిత అదృశ్యమైన ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కంగ్టి మండలానికి చెందిన సౌందర్యకు నారాయణఖేడ్ మండలం కొండాపూర్ తండాకు చెందిన కేతావత్ రామచందర్ తో వివాహం జరిగింది. వివాహం అనంతరం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని చైతన్య నగర్‌కి వచ్చి నివాసం ఉంటున్నారు. గత నెల 24న సౌందర్య కనిపించడం లేదని రామచందర్ అత్తామామలకు చెప్పాడు. సౌందర్య కుటుంబ స భ్యులు తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. మద్యానికి బానిసైన రామచందర్ నిత్యం తమ కూతురిని హింసించేవాడని, అతడిపై అనుమానం ఉందని బాధితురాలి తల్లి బుజ్జి బాయి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు న మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం