
ఛాయాచిత్రకళలో వాస్తవాన్వేషణ
ఐఐటీ ప్రొఫెసర్ డాక్టర్ దీపక్ జాన్
పటాన్‌చెరు: ‘ఒక చిత్రం వెయ్యి పదాలకు సమానం’అనేది నానుడి. దానిని మరింత విస్తృతపరుస్తూ, ఛాయా చిత్రకళలో ‘నిజాన్ని వెతుక్కుంటూ..’అనే శీర్షికన ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ దీపక్ జాన్ మాథ్యూ బుధవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గెస్ట్ లెక్చర్ ఇచ్చారు. ఛాయా చిత్రకళపై లోతైన అవగాహనను ఏర్పరిచేలా సాగిన ఈ కార్యక్రమంలో ఫొటోగ్రఫీ చారిత్రక పరిణామం వంటి అంశాలను వివరించారు.
కుండల తయారీపై అవగాహన...
గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్‌సైన్సెస్ (జీఎస్‌హెచ్‌ఎస్)లోని లలిత, ప్రదర్శన కళల విభాగం కుండల తయారీపై ఒక రోజు వర్క్ షాప్‌ను నిర్వహించింది. ఇందులో పాల్గొన్న వారికి, మట్టితో పనిచేయ డం వల్ల కలిగే సృజనాత్మక, చికిత్స ప్రయోజనాలను తెలియజేశారు. కుండలు మాన సిక దృష్టి, ఏకాగ్రతను ఎలా పెంచుతాయో, ప్రశాంతతను, సద్భుద్ధిని ఎలా పెంపొందిస్తాయో ఈ వర్క్‌షాప్‌లో వివరించారు.