గ్రాట్యూటీ ప్రకారం డబ్బులు చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

గ్రాట్యూటీ ప్రకారం డబ్బులు చెల్లించాలి

Mar 12 2025 9:05 AM | Updated on Mar 12 2025 9:05 AM

గ్రాట్యూటీ ప్రకారం డబ్బులు చెల్లించాలి

గ్రాట్యూటీ ప్రకారం డబ్బులు చెల్లించాలి

సంగారెడ్డి జోన్‌: కాంట్రాక్టు కార్మికులుగా 10 ఏళ్లకు పైగా పనిచేసిన ట్రైనీ కార్మికులకు గతంలో యాజమాన్యం ఇచ్చిన హామీ మేరకు గ్రాట్యూటీ చట్టం ప్రకారం డబ్బులు చెల్లించాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సదాశివపేటలోని ఎంఆర్‌ఎఫ్‌ కంపెనీ యాజమాన్యం, ఆ సంస్థలో పనిచేస్తున్న ట్రైనీ కార్మికుల మధ్య వివాదం తలెత్తటంతో సోమవారం కలెక్టర్‌, పరిశ్రమ యజమాన్యం, కార్మికులు, అధికారులతో చర్చలు జరిపారు. ట్రైనీ కార్మికులు తమ ఇష్టపూర్వకంగా కంపెనీలో పనిచేయదలుచుకుంటే వారిని కాంట్రాక్ట్‌ కార్మికులుగా తీసుకోవడానికి కంపెనీ యాజమాన్యం అంగీకరించింది. సమాన పనికి సమాన వేతనం చట్టం ప్రకారం తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలని పరిశ్రమ కార్మికులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. కార్మికుల పనితీరు అర్హతలను బట్టి వారికి వేతనం రూ.18 వేల నుంచి రూ.24 వేల వరకు ఇవ్వడానికి కంపెనీ యాజమాన్యం అంగీకరించింది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మాధూరి, ట్రైనీ కలెక్టర్‌ మనోజ్‌, అదనపు ఎస్పీ సంజీవరావు, ఉప కార్మిక కమిషనర్‌ రవీందర్‌రెడ్డి , కార్మిక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రతీ మండలంలో హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేయాలి ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారుల కొరకు ప్రతీ మండల కార్యాలయాలలో హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటుచేయాలని కలెక్టర్‌ క్రాంతి టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా మంగళవారం ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కార్యాలయాలకు వచ్చి చెల్లించేవారికి సిబ్బంది సహాయసహకారాలు అందించాలన్నారు. ఈ నెల 31 లోపు పూర్తిస్థాయి ఎల్‌.ఆర్‌.ఎస్‌ ఫీజుతో పాటు ప్రో–రాటా ఓపెన్‌ స్పేస్‌ చార్జీలను చెల్లించే వారికి ప్రభుత్వం 25 శాతం రిబేటు వర్తింపజేస్తోందని ప్రచారం చేయాలని చెప్పారు. స్థలాల క్రమబద్ధీకరణ పారదర్శకంగా చేపట్టాలని తెలిపారు. అన్ని మున్సిపాలిటీల పరిధిలో 76 మంది, రూరల్‌ ఏరియాలో 116 ఎల్‌ఆర్‌ఎస్‌, ఈ పేమెంట్స్‌ జరిగాయని వెల్లడించారు. ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులకు రిబేటును మినహాయిస్తూ, వెంటవెంటనే ల్యాండ్‌ రెగ్యులరైజెషన్‌కు సంబంధించిన ప్రొసీడింగ్‌లు జారీ చేయడం జరుగుతోందని కలెక్టర్‌ వివరించారు.

మార్చి 31లోగా పెట్రోల్‌ బంకు ప్రారంభించేలా చర్యలు

కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

సంగారెడ్డి జోన్‌: జిల్లా మహిళా సమాఖ్య ద్వారా చేపడుతున్న ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ పెట్రోల్‌ బంకు మార్చి 31లోగా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరు వల్లూరు క్రాంతి అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లా మహిళా సమాఖ్య కమర్షియల్‌ కాంప్లెక్స్‌ లో షాపుల అలాట్మెంట్‌ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. బ్యాంకు లింకేజీ ద్వారా మహిళా సంఘాలకు రుణాలు మార్చి 18వ తేదీ లోగా 100% పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ అదనపు పీడీలు జంగారెడ్డి, బాలరాజ్‌, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల అధికారులు, పీడీ హౌసింగ్‌ రవాణా శాఖ అధికారులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ వల్లూరు క్రాంతి ఆదేశం

ఎంఆర్‌ఎఫ్‌ యాజమాన్యం,

కార్మికులతో చర్చలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement