జహీరాబాద్: పట్టణంలోని సిద్ధేశ్వర ఆలయ ప్రాంగణంలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహక అధికారి పి.మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ధ్వజ స్తంభం, నవగ్రహ, కాళభైరవ, మంగళగౌరి, యంత్ర, నాగదేవత, ఆంజేయస్వామి, పంచలింగాలు, హఠేశ్వర, నందీశ్వర విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమాలలో భాగంగా మొదటి రోజు గోపూజ, ధ్వజారోహణం, ఆలయ ప్రవేశం, మహా గణపతిపూజ, స్వస్తి పుణ్య హవచనం, అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమం, ప్రతిష్ఠా మూర్తుల ఊరేగింపు, జలాదివాసం, మహా మంగళ హారతి, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు.