
వెంకటేశం మృతదేహం
రామచంద్రాపురం(పటాన్‌చెరు): బైక్ అదుపు తప్పి కింద పడిన వ్యక్తి మృతిచెందిన సంఘటన రామచంద్రాపురంలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. స్నేహ లేక్‌వ్యూలో నివాసం ఉండే వెంకటేశం(56) వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా సోమవారం తన స్కూటీపై లింగంపల్లి నుంచి పటాన్‌చెరుకు వెళ్తుండగా.. సీతార హోటల్ సమీపాన వాహనం అదుపు తప్పి కింద పడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ చికిత్సపొందుతూ మంగళవారం అతను మృతిచెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.