న్యాయ సేవలపై అవగాహన సదస్సులు | - | Sakshi
Sakshi News home page

న్యాయ సేవలపై అవగాహన సదస్సులు

Nov 10 2023 6:46 AM | Updated on Nov 10 2023 6:46 AM

జోగిపేట(అందోల్‌): చట్టాలపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌, జూనియర్‌ సివిల్‌ కోర్డు జడ్జి ధనలక్ష్మి అన్నారు. గురువారం జోగిపేటలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం ఉచిత న్యాయ సహాయం, గృహహింస, పోక్సో చట్టం, న్యాయ సేవాధికార సంస్థ సేవల గురించి వివరించారు. అన్యాయం జరిగితే నిర్భయంగా ఫిర్యాదు చేయాలన్నారు. క్రమశిక్షణతో చదువుకొని తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో న్యాయ వాది నర్సింహులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నేరాలు తగ్గుముఖం

నారాయణఖేడ్‌: చట్టాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలని నారాయణఖేడ్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి శ్రీధర్‌ మంథాని అన్నారు. గురువారం కోర్టు ఆవరణ నుంచి పొట్టి శ్రీరాములు చౌక్‌ వరకు న్యాయవాదులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సులో జడ్జి మాట్లాడుతూ చట్టాలపై అవగాహన ఉంటే నేరం చేయడానికి భయపడతారని, దీంతో నేరాలు తగ్గుముఖం పడతాయన్నారు. విద్యార్థినులు తమ కుటుంబ సభ్యులకు చట్టాలపై అవగాహన కల్పించి వారిని చైతన్యపరచాలన్నారు. కార్యక్రమంలో న్యా యవాదులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

విద్యార్థుల కలిసి ర్యాలీ

పటాన్‌చెరు టౌన్‌: చట్టాలపై అవగాహన తప్పనిసరిగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి హనుమంతరావు అన్నారు. గురువారం పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని మహాత్మా జ్యోతిబాపూలే వసతి గృహంలో చట్టాలు, న్యాయసేవలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా విద్యార్థులతో కలిసి ర్యాలీ తీశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ లక్ష్మీనారాయణ, టీచర్లు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement