
మండలంలోని ముస్త్యాల గ్రామంలో గురవారం పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రచారం చేస్తుండగా ఓ చోట బాలుడు తన చిన్న కారుతో ఎదురయ్యాడు. అది చూసిన పల్లా బాలుడి వద్దకు వెళ్లి నీ కారు ఇస్తావా.. ప్రచారంలో వాడుకుంటా అంటూ బాలుడికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. దీంతో అందరి దృష్టి బాలుడి కారుపై పడింది. అలాగే ఆసరా పెన్షన్ ఇస్తూ పెద్ద కొడుకు వలె ఆసరవుతున్న కేసీఆర్ సార్ వెంటే మేమంతా ఉంటాము. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించి తీరుతామని ఓ అవ్వ బీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెవిలో చెప్పింది.
–చేర్యాల(సిద్దిపేట)