పుస్తకావిష్కరణ | - | Sakshi
Sakshi News home page

పుస్తకావిష్కరణ

Mar 28 2026 10:36 AM | Updated on Mar 28 2026 10:36 AM

మహేశ్వరం: శ్రీవత్స వనమాలి సేవా ఫౌండేషన్‌ తరఫున ప్రచురించిన శ్రీనివాస అను ‘గ్రహ’ నవరత్నాలు పుస్తకాన్ని త్రిదండి చిన్నజీయర్‌ స్వామి ఆవిష్కరించారు. ముచింతల్‌లోని ఆశ్రమంలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న అనంతరం జీయర్‌ స్వామిని ఎస్‌వీఎస్‌ఎఫ్‌ నిర్వాహకులు కలిసి ఆశీస్సులు తీసుకుని స్వామీజీ చేతికి ఈ పుస్తకాన్ని అందజేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ విభీషణశర్మ రచించిన ఈ పుస్తకంలో వేంకటేశ్వర సుప్రభాతంలోని తొమ్మిది శ్లోకాలను నవగ్రహాలతో అన్వయించి, సుప్రభాత శ్లోకాలను చదవడం ద్వారా శ్రీనివాసుని అనుగ్రహంతో గ్రహ దోషాలు తొలగిపోతాయని ఈ పుస్తకంలో రచయిత భాష్యం చెప్పారు. వేంకటేశ్వరస్వామి ఆధీనంలోనే నవగ్రహాలు ఉంటాయన్నది ఈ పుస్తకంలోని సారాంశం. చిన్నజీయర్‌ స్వామి చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన తర్వాత అక్కడకు వచ్చిన భక్తులకు ఉచితంగా వితరణ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement