● మూగజీవాలను తరలిస్తున్న కంటైనర్ల పట్టివేత
● పోలీసులకు అప్పగించిన హిందూవాహిని, బజరంగ్‌దళ్ సభ్యులు
షాద్‌నగర్‌రూరల్: అక్రమంగా గోవులను తరలిస్తు న్న కంటైనర్లను హిందూవాహిని, బజరంగ్‌దళ్ సభ్యులు పట్టుకున్నారు. బైక్‌పై వెంబడించి గోవు లను అక్రమంగా తరలిస్తున్న మూడు కంటైనర్లను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి.. శ్రీరామనవమి సందర్భంగా హిందూవాహిని సభ్యులు గురువారం అర్థరాత్రి పట్టణంలోని ముఖ్యకూడలిలో తోరణాలు కడుతున్నారు. అదే సమయంలో మూడు కంటైనర్లు వెళ్తున్నాయి. అనుమానం వచ్చిన వారు కంటైనర్లను అడ్డుకునేందుకు ప్రయత్నించగా డ్రైవర్లు వాహనాలను ఆప కుండా అతివేగంగా వెళ్లారు. దీంతో అనుమానం వచ్చిన హిందూవాహిని, బజరంగ్‌దళ్ సభ్యులు ద్విచక్రవాహనాలతో వెంబడించి రెండు కంటైనర్లను పట్టుకోగా ఒక కంటైనర్ ఆపకుండా వెళ్లిపోయింది. పట్టుకున్న రెండు కంటైనర్లలో చూడగా అందులో 48 గోవులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. గోవులను వెంటనే చౌడమ్మగుట్ట ఆంజనేయస్వామి దేవాలయం ఆవరణలోని శ్రీకృష్ణ గోశాలకు తరలించారు. విషయం తెలియడంతో మరో వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు గోశాల వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య మాటామాటా పెరగడంతో తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ సీతారాం తెలిపారు.


