ముత్యాల తలంబ్రాలు.. బాజాభజంత్రీలు.. అశేషభక్త జనవాహిని నడుమ లోక కల్యాణ కారకుడు, జగదబి శ్రీరాముడి కల్యాణోత్సవాన్ని శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహేశ్వరం నియోజకవర్గం వ్యాప్తంగా పలు ఆలయాలు, కూడళ్లలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిపించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జై శ్రీరామ్ నినాదంతో ఆ పరిసరాలన్నీ మార్మోగాయి. రామనామంతో భక్తులు తన్మయంలో మునిగిపోయారు. పలుచోట్ల అన్నప్రసాద వితరణ నిర్వహించి, శోభాయాత్ర చేపట్టారు. – సాక్షి, నెట్‌వర్క్


