సుప్రీం తీర్పు హర్షణీయం
బడంగ్‌పేట్: 102 ఎకరాలు ఫారెస్ట్‌దే అని సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వడం సంతోషకరమని అడిషినల్ పీసీసీఎఫ్ శర్వానంద్ అన్నారు. బడంగ్‌పేట సర్కిల్‌లోని గుర్రంగూడ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గుర్రంగూడ ఫారెస్ట్ రేంజ్‌లో అత్యంత విలువైన 102 ఎకరాల భూమిపై సాలార్‌జంగ్ వారసుల వాదనను సుప్రీంకోర్టు తోసి పుచ్చిందని తెలిపారు. సరైన సమయంలో అటవీ అధికారులు వ్యవహరించడంతో 102 ఎకరాలు ప్రభుత్వ పరమైనట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా ఫారెస్ట్ అధికారి గోపిడి రోహిత్‌రెడ్డి, రేంజ్ అధికారి కె.శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ రేంజ్ అధికారి కస్లనాయక్, ఆర్డీవో అనంతరెడ్డి, తహసీల్దార్, సిబ్బంది పాల్గొన్నారు.


