నాయకత్వ లక్షణాలు లక్ష్యం
గురునానక్‌లో జాతీయ స్థాయి బిజినెస్ కాన్‌క్లేవ్
ఇబ్రహీంపట్నం రూరల్: విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, వ్యాపార దృష్టిని పెంపొందించేడమే లక్ష్యంగా గురునానక్ యూనివర్సీటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ కామర్స్‌లో జాతీయ స్థాయి బిజినెస్ కాన్‌క్లేవ్–2025ను శుక్రవారం నిర్వహించారు. పరిశ్రమ–విద్యా రంగాల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడం కోసం అవగాహన కల్పించారు. గురునానక్ ఇనిస్టిట్యూషన్స్ ఛాన్సలర్, వైస్ చైర్మన్ సర్దార్ గగన్‌దీప్ సింగ్ కోహ్లి, వైస్ చాన్సలర్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హెచ్‌ఎస్ సైనీ మార్గదర్శకత్వంలో నిర్వహించారు. సెమినార్ ప్రారంభోత్సవానికి రెక్టర్ డాక్టర్‌సీ కలైరాసన్, రిజిస్ట్రార్ డాక్టర్‌విశాల్ వాలియా, అడ్వైజర్ డాక్టర్ ఎంపీ సింగ్ ఇషార్‌లు హాజరై ప్రారంభించారు. నవీన వ్యాపార దోరణులు, డిజిటల్ మార్పులు, నాయకత్వం, సస్టైనబిలిటీ, భవిష్యత్ వ్యాపార అవకాశాలు వంటి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోజ్ మేరీ తదితరులు పాల్గొన్నారు.
కబడ్డీ పోటీల్లో సాయిచరణ్ ప్రతిభ
జాతీయస్థాయిలో గుర్తింపు
ఆమనగల్లు: భోపాల్‌లో శుక్రవారం జరిగిన జాతీయస్థాయి కబడ్డీ చాంపియన్‌షిఫ్ పోటీల్లో దయ్యాలబోడు తండాకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి సాయిచరణ్ అత్యంత ప్రతిభ కనబరిచి బెస్ట్ రైడర్‌గా బహుమతిని అందుకున్నాడు. ఆమనగల్లు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి సాయిచరణ్ రాష్ట్రస్థాయి కబడ్డీ చాంపియన్‌షిఫ్ పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. అండర్ 17 విభాగంలో సాయిచరణ్ సాయిచరణ్ బెస్ట్ రైడర్ అవార్డు అందుకున్నాడు.
అధికారులపై చర్యలు తీసుకోవాలి
ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ టీచర్ల ధర్నా
ఇబ్రహీంపట్నం: అంగన్‌వాడీ టీచర్లపై అనుచిత వాఖ్యలు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మీ డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నంలోని శాస్త్ర గార్డెన్‌లో శుక్రవారం నిర్వహించిన బీఎల్వోల సమావేశంలో ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మీ పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. గ్రామాల్లో ఎదురయ్యే సమస్యలు, పారితోషికం తదితర విషయాలపై డీటీ ప్రవీణ్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళితే అనుచిత వాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను చూడకుండా, కనీస గౌరవం ఇవ్వకుండా, తమను అగౌరవ పరిచే వాఖ్యలు చేశాడని మండిపడ్డారు. అనంతరం వారు ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తక్షణమే ఉన్నతాధికారులు ఈ విషయంలో స్పందించి ఎలక్షన్ డీటీపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నేతలు పి. కృష్ణ, జగన్, అంగన్‌వాడీ యూనియన్ నాయకులు బాలమణి, అండాలు, సువర్ణ, యాదమ్మ, మంజుల, విజయలక్ష్మీ, హంసమ్మ, శివరాణి పాల్గొన్నారు. కాగా ఆర్డీవో అందుబాటులో లేకపోవడంతో సీనియర్ అధికారికి వినతిపత్రం సమర్పించారు.
జింక పిల్లను ఫారెస్ట్ సిబ్బందికి అప్పగింత
కందుకూరు: లేమూరు పరిధిలోని రోబోమాటిక్ కంపెనీ ఫారెస్ట్ ఫెన్సింగ్‌లో చిక్కుక్కున్న జింక పిల్లను గ్రామస్తులు కాపాడారు. మాజీ సర్పంచ్ పరంజ్యోతి ఆధ్వర్యంలో శుక్రవారం అటవీ సిబ్బంది అందజేశారు. వీరిలో శ్రీకాంత్, కార్తీక్, అనిరుధ్, ఆకాష్, రోబోమాటిక్ కంపెనీ సిబ్బంది ఉన్నారు.
నాయకత్వ లక్షణాలు లక్ష్యం
నాయకత్వ లక్షణాలు లక్ష్యం
నాయకత్వ లక్షణాలు లక్ష్యం


