తొలి విడత ప్రశాంతం!
వికారాబాద్‌లో 81.21 శాతం పోలింగ్ చెదురు ముదురు ఘటనలు మినహా సజావుగా ఎన్నికలు పోలీసుల భారీ బందోబస్తు చర్యలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ నారాయణరెడ్డి
తొలి విడత ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఇలా..
సాక్షి, రంగారెడ్డి జిల్లా/షాద్‌నగర్: చెదురు ముదురు ఘటనలు మినహా తొలివిడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం ఉదయం ఏడు గంటల కే ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. తెల్లవారుజామున చలితీవ్రత దృష్ట్యా.. ఓటింగ్ ప్రక్రియ ఉద యం కొంత మందకొండిగా సాగినా.. 11 తర్వాత ఊపందుకుంది. పోలింగ్ కేంద్రాల ఎదుట ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరడం కన్పించింది. అభ్యర్థు లు, వారి మద్దతుదారులు పోలింగ్ కేంద్రాల ముందు గుంపులుగా నిలబడి ఓటర్లను అభ్యర్థించడం, వృద్ధులు, దివ్యాంగులను వీల్ చైర్లపై తీసుకొచ్చి ఓటేయించిన దృశ్యాలు కన్పించాయి. మధ్నాహం ఒంటి గంట లోపు వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు ఓటింగ్ అవకాశం కల్పించారు. భోజన విరామం తర్వాత పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. తొలుత వార్డుల ఓట్లను, ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కించారు. అనంతరం ఫలితాలు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల ముందు పెద్ద సంఖ్యలో గుమిగూడిన మద్దతుదారులు తమ అభ్యర్థుల విజయంతో పెద్దఎత్తున బాణసంచా కాల్చి, రంగులను చల్లుకుంటూ డీజే హోరులో సంబురాలు చేసుకున్నారు. ఆ తర్వాత జులూస్ నిర్వహించారు.
168 స్థానాల్లో పోటీ
జిల్లాలో 168 సర్పంచ్, 1340 వార్డులకు ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. మొత్తం 2,11,544 మంది ఓటర్లకుగాను 1,87,573 మంది (88.67 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక వికారాబాద్ జిల్లా తాండూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఎనిమిది మండలాల్లో 225 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 2,66,252 మంది ఓటర్లకు గాను.. 2,16,212 మంది (81.21శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెదురు ముదురు ఘటనలు మినహా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో ఆయా జిల్లాల ఎన్నికల యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. చివరి నిమిషం వరకు పోరాడి ఓడిపోయిన వాళ్లు ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు ప్రకటించి మౌనంగా తప్పుకోగా, గెలుపొందిన అభ్యర్థులు సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు విజయోత్సవాల్లో ముగిని తేలారు.
ఓటేసిన ప్రముఖులు
షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన స్వగ్రామమైన నందిగామ మండలం వీర్లపల్లిలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కేశంపేట మండలం ఎక్లాస్‌ఖాన్‌పేట్‌లో ఓటేశారు. ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి నందిగామ మండలం మొదళ్లగూడలో ఓటు వేశారు. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి ఫరూఖ్ నగర్ మండలం దూస్కల్‌లో, మరో మాజీ ఎమ్మెల్యే బొక్కని నరసింహులు లింగారెడ్డిగూడలో ఓటేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్వగ్రామమైన వీర్లపల్లిలో తన మద్దతుదారు ఓడిపోయారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాత్రం తన గ్రామంలో మళ్లీ తన పట్టు నిలుపుకోవడం విశేషం.
ప్రశాంతంగా పోలింగ్
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. గురువారం పలు పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఓటరు జాబితాలో ఓటర్ల క్రమసంఖ్య సరి చూసుకొని ఓటింగ్ ప్రక్రియను నిర్వహించాలని ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. ఓటింగ్ శాతం నమోదును ఎప్పటికప్పుడు నిర్దేశిత ఫార్మాట్లో నమోదు చేయాలని స్టేజ్–2 రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు పోలింగ్ కేంద్రం ఆవరణలో ఓటు వేసేందుకు క్యూలో ఉన్న వారందరికీ అవకాశం కల్పించాలన్నారు.
కేశంపేట: సిరా చుక్కను చూపుతున్న
మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
ఎలికట్టలో ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధుడికి సహాయం చేస్తున్న కానిస్టేబుల్
నందిగామ వీర్లపల్లిలో ఓటేయడానికి వచ్చిన
శతాధిక వృద్ధురాలు పుల్లమ్మ
రంగారెడ్డిలో 88.67 శాతం
మండలం మొత్తం ఓటర్లు 9 గంటల వరకు 11వరకు ఒంటిగంట వరకు పోలింగ్‌శాతం
ఫరూఖ్‌నగర్ 50,557 13,359 28,539 44,820 88.65
చౌదరిగూడ 25,869 7,077 15,602 22,632 87.49
కేశంపేట్ 36,250 6,933 17,666 32,588 89.09
కొందుర్గ్ 22,243 5,114 12,137 19,711 88.62
కొత్తూరు 16,813 4,102 10,448 15,346 91.27
నందిగామ 26,499 5,828 14,715 23,549 88.87
శంషాబాద్ 33,313 5,850 15,898 28,934 86.85
తొలి విడత ప్రశాంతం!
తొలి విడత ప్రశాంతం!


