ఎత్తుకు పైఎత్తు!
సర్పంచుల వేటలోకాంగ్రెస్, బీఆర్‌ఎస్ సయ్యాట స్వగ్రామమైన వీర్లపల్లిలోఎమ్మెల్యేకు షాక్ పలుచోట్ల తలకిందులైన అంచనాలు రసవత్తరంగా పంచాయతీ ఎన్నికల పోరు
షాద్‌నగర్: ఎన్నికలు అంటేనే అంచనాలకు అందవు.. ఎన్ని వ్యూహాలు రచించినా చివరికి తలకిందులు కాక తప్పదు. ఈ పంచాయతీ ఎన్నికల్లోనూ అచ్చంగా అదే జరిగింది. కాంగ్రెస్ అంచనాలను తారుమారు చేస్తూ కొన్ని చోట్ల బీఆర్‌ఎస్ సత్తా చాటగా.. బీఆర్‌ఎస్ కోటగా భావించే గ్రామాల్లో కాంగ్రెస్ పాగా వేసింది. ఇలా ఒక్కో చోట ఒక్కో ఆట.. పల్లెల్లో సర్పంచ్ స్థానాల వేట.. అత్యంత రసవత్తరంగా సాగిన పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో జరిగిన పోరును ఓ సారి పరిశీలిస్తే అవగతం అవుతోంది.
బీఆర్‌ఎస్‌దే ఎక్లాస్‌ఖాన్‌పేట
బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ స్వగ్రామమైన ఎక్లాస్‌ఖాన్‌పేటలో ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థి హరిశేఖర్ విజయం సాధించారు. బీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ రెడ్డి మద్దతులో బరిలో దిగిన ప్రవీణ్‌యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌యాదవ్‌లు ఓటమి పాలయ్యారు.
దూసకల్ హస్తగతం
మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి స్వగ్రామమైన ఫరూఖ్‌నగర్ మండలం దూసకల్ గ్రా మంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి జ్యో తి విజయం సాధించారు. ఆ గ్రామం మొ దటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది.
స్వగ్రామంలో ఎమ్మెల్సీ హవా
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌కుమార్‌రెడ్డి స్వగ్రామమైన నందిగామ మండలం మొదళ్లగూడలో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌కుమార్‌రెడ్డి అభ్యర్థి పెండ్యాల అరుణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 407 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్వగ్రామమైన వీర్లపల్లిలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. అయితే బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థితో పాటుగా, కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థి ఓటమి పాలయ్యారు. బీఆర్‌ఎస్ రెబల్‌గా ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌కుమార్‌రెడ్డి బలపర్చిన అభ్యర్థి పాండు సర్పంచ్‌గా విజయం సాధించారు. మొదటి నుంచి ఎమ్మెల్యే శంకర్‌కు పట్టున్న స్వగ్రామంలో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి అనుచరుడు విజయం సాధించడం విశేషం.
ఫరూఖ్‌నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామంలో కాంగ్రెస్, టీడీపీ బలపర్చిన అభ్యర్థి ఎంసీ రాజు సమీప బీఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి భీష్వ రామకృష్ణపై విజయం సాధించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు, కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే భీష్వ కిష్టయ్యలు ఉన్న ఈ గ్రామంలో రెండు పార్టీలు బలపర్చిన అభ్యర్థి విజయం సాధించారు.
ఎమ్మెల్యే ఊరిలో
ఎదురుదెబ్బ
కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థి విజయం


