స్కూల్ బస్సు ఢీకొని యువకుడు మృతి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రైవేట్ స్కూల్ బస్సు బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. హన్మకొండ జిల్లా ధర్మసాగరం మండలం, నర్సింగ్‌రావుపల్లికి చెందిన బండారి వినోద్ (22) ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తుండేవాడు. ఓ హల్దీ ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలు తీసేందుకు టీఎస్27ఎఫ్ 3270 స్కూటీపై బొంగ్లూర్ నుంచి ఔటర్ సర్వీస్ రోడ్డు మీదుగా తుక్కుగూడకు వెళ్తున్నాడు. రావిర్యాల శివారులోని కళాంజలి సమీపంలో ఇండస్‌వాలీ స్కూల్ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. బైక్ పైనుంచి కింద పడిన వినోద్‌ను రోడ్డుపై కొద్దిదూరం లాక్కెళ్లింది. దీంతో తీవ్రగాయాలైన బాధితుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈసమయంలో బస్సులో విద్యార్థులెవరూ లేరు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
స్కూల్ బస్సు ఢీకొని యువకుడు మృతి


