హైదర్షాకోట్‌లో హిట్ అండ్ రన్
మణికొండ: రోడ్డు పక్కన నడిచి వెళుతున్న వ్యక్తిని ఓ కారు వెనకనుంచి వచ్చి ఢీ కొట్టి పరారైన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని హైదర్షాకోట్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. హైదర్షాకోట్ సెక్టార్ ఎస్సై మల్లేష్‌యాదవ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హైదర్షాకోట్ గ్రామానికి చెందిన ఎడ్ల కృష్ణ(45) కూలీ పనిచేసేవాడు. శనివారం ఉదయం అతను గ్రామంలోని బొడ్రాయి వద్ద రోడ్డుపై నడిచి వెళుతుండగా వెనక నుంచి వచ్చిన కియా కారు అతడిని ఢీ కొట్టింది. దీంతో అతను కింద పడిపోగా కారు చక్రాలు అతడి తలపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కారు ఆపకుండా పారిపోయాడు. మృతుని సోదరుడు రఘు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ప్రమాదానికి కారణమైన కారును గుర్తించారు. కారుతో కర్నూల్ వైపు పరారైనట్లు గుర్తించి ఓబృందాన్నిపంపామని, త్వరలోనే నిందితుడిని అరెస్టు చేస్తామని ఎస్సై తెలిపారు.
● వ్యక్తిని కారుతో ఢీ కొట్టి పరార్
● వాహనాన్ని గుర్తించిన పోలీసులు
● పరారీలో నిందితుడు
హైదర్షాకోట్‌లో హిట్ అండ్ రన్


