భారతి సిమెంట్‌కు తిరుగులేదు
ఇబ్రహీంపట్నం: సిమెంట్ రంగంలో తిరుగులేని ‘రారాజు భారతి సిమెంట్’ అని ఆ సంస్థ టెక్నికల్ ఇంజనీర్ సామ్రాట్ అన్నారు. వెంకటేశ్వర ట్రెడర్ డీలర్ శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఇబ్రహీంపట్నంలో తాపీ మేసీ్త్రల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణ రంగంలో ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో వినియోగదారులకు నాణ్యమైన, దృఢమైన సిమెంట్‌ను అందజేస్తోందని తెలిపారు. అల్ట్రాఫాస్ట్ పేరుతో ఫాస్ట్ సెట్టింగ్ ఫైవ్ స్టార్ గ్రేడింగ్ సిమెంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసిందన్నారు. ఇతర సిమెంట్‌లతో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్‌తో నిర్మాణ ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని వివరించారు. స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జిలు, రహదారులకు ఇది సరైన ఎంపిక అని స్పష్టంచేశారు. తమ కంపెనీ సిమెంట్‌ను వాడే వినియోగదారులకు ఉచిత సాంకేతిక సహాయం అందజేస్తామని, స్లాబ్ కాంక్రీట్ వేసే సమయంలో నిపుణులైన సంస్థ ఇంజనీర్లు సైట్ వద్దకు వచ్చి సాయపడుతారని చెప్పారు. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్ ధరలతో పొలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్ బ్యాగ్‌కు రూ.20 ఎక్కువగా ఉంటుందన్నారు. డీలర్ శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. భారతి సిమెంట్ సర్వీస్ చాలా ఫాస్ట్‌గా ఉంటుందని తెలిపారు. అనంతరం 30 మంది తాపీ మేసీ్త్రలకు రూ.లక్ష ప్రమాద బీమా బాండ్లు, గిఫ్ట్‌లు అందజేశారు.
అల్ట్రాఫాస్ట్‌తో ఫాస్ట్ సెట్టింగ్,
ఫైవ్ స్టార్ గ్రేడింగ్
వినియోగదారులకు ఉచిత సాంకేతిక సాయం
సంస్థ టెక్నికల్ ఇంజనీర్ సామ్రాట్
తాపీ మేసీ్త్రలకు ప్రమాద బీమా బాండ్లు, గిఫ్ట్‌ల అందజేత


