
సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
నందిగామ: విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి, పర్యాటక సాంస్కృతిక క్రీడల ప్రత్యేక ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. మండల పరిధిలోని మొదుళ్లగూడ శివారులోని సింబయాసిస్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో సోమవారం నిర్వహించి దీక్షారంబ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహిస్తోందని తెలిపారు. టెక్నాలజీ రంగంలో శరవేగంగా మార్పులు వస్తున్నాయని, వాటికి అనుకూలంగా విద్యార్థుల్లో సైతం మార్పురావాలని సూచించారు. టెక్నాలజీలో ప్రపంచంతో పోటీ పడేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.సైబర్ క్రైం డీసీపీ సాయి శ్రీ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రతి విషయంపై ప్ర త్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ చాన్స్‌లర్లు విద్యా యోరవడేకర్, శంతరాం బలవంత్ ముజుందార్, వైస్ చాన్సలర్ రా మ కృష్ణన్ రామన్, కుమార్ విజయ్ మిశ్రా, వేణుగోపా ల్ రెడ్డి, పలువురు డైరెక్టర్లు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.