
నాలుగో రోజు 4,170 మంది
కందుకూరు: మండలంలోని మీర్‌ఖాన్‌పేట రెవెన్యూలోని ఏటీసీ సెంటర్‌లో నిర్వహిస్తున్న లాటరీ ద్వారా ఫార్మా ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను శుక్రవారం కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ తదితర అంశాలను పర్యవేక్షించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. నాలుగో రోజు 4,170 మంది లబ్ధిదారులకు ప్లాట్లను డ్రా తీసినట్లు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. అందులో 2,062 మంది హాజరు కాగా 1,572 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకోవడానికి గైర్హాజరైన వారు ఫారం 32ఏ, ఆధార్, పాన్‌కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటోలతో రావాలని సూచించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, నాయిబ్ తహసీల్దార్ రాజు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రైతులకు ప్లాట్ల కేటాయింపు
ప్రక్రియను పర్యవేక్షించిన కలెక్టర్