
కొనసాగుతున్న ప్లాట్ల కేటాయింపు
కందుకూరు: ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు మండలంలోని మీర్‌ఖాన్‌పేట రెవెన్యూలో ఏర్పాటు చేసిన లేఅవుట్‌లో లాట రీ ద్వారా చేపట్టిన ప్లాట్ల పంపిణీ కార్యక్రమం గురువారం నాలుగో రోజు కొనసాగింది. కందుకూరు, ఇబ్రహీంపట్నం ఆర్డీఓలు జగదీశ్వర్‌రెడ్డి, అనంత్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 242 గజాలు, 302 గజాలకు సంబంధించిన ప్లాట్లను లాటరీ ద్వారా రైతులకు కేటాయించారు. శుక్రవారం అన్ని గ్రామాలకు సంబంధించి 363 గజాలు, 423 గజాలు, 484 గజాలు, 544 గజాలు పొందినవారికి ప్లాట్లు కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు.
లాటరీ ప్రక్రియను పరిశీలించిన సీపీ
లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను గురువారం రాచకొండ సీపీ సుధీర్‌బాబు పరిశీలించారు. ప్లాట్ల పంపిణీ, బందోబస్తును పర్యవేక్షించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ తదితర అంశాల గురించి అధికారులను ఆరా తీశారు. శాంతిభద్రతలకు ఆటంకం కలుగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, అదనపు డీసీపీ సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, గ్రీన్ ఫార్మాసిటీ సీఐ లిక్కి కృష్ణంరాజు తదితరులు ఉన్నారు.