
లారీ, కారు ఢీ ఇద్దరి దుర్మరణం
కొత్తూరు: లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో మాజీ సర్పంచ్‌తో పాటు అతని బంధువు చనిపోయిన సంఘటన కొత్తూరు మున్సిపల్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలం, దిలావర్‌గూడ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పరిగి చంద్రశేఖర్‌రెడ్డి (45), అతని బంధువు నందిగామ మండలం, దేవుని మామిడిపల్లికి చెందిన ఎర్రగుంట చంద్రశేఖర్‌రెడ్డి ఇంటికి వచ్చాడు. అనంతరం రాత్రి కారులో నందిగామ నుంచి కొత్తూరు రైల్వే బ్రిడ్జిపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నర్సింహారావు తెలిపారు.
మాజీ మంత్రి నివాళి..
మహేశ్వరం: చంద్రశేఖర్‌రెడ్డి మృతి విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తదితరులు దిలావర్‌గూడకు చేరుకున్నారు. మృతుడికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. బీఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షుడు హన్మగళ్ల చంద్రయ్య, సుభాన్‌పూర్ మాజీ సర్పంచ్ గుత్తి పద్మ పాండు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నర్సింహగౌడ్ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
మృతుల్లో దిలావర్‌గూడ మాజీ సర్పంచ్, అతని బంధువు
కొత్తూరు రైల్వే బ్రిడ్జిపై ప్రమాదం

లారీ, కారు ఢీ ఇద్దరి దుర్మరణం