
డెలివరీ బాయ్‌పై దాడి
జగద్గిరిగుట్ట: డెలివరీ బాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జగద్గిరిగుట్ట సీఐ నర్సింహ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దేవమ్మ బస్తీకి చెందిన శ్రీకాంత్ జియో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. కాగా సోమవారం రాత్రి పనులు ముగించుకు ఐడీపీఎల్ నుంచి జగద్గిరిగుట్ట వైపు వెళుతుండగా పాపిరెడ్డి నగర్ ప్రధాన రహదారిలో గుర్తు తెలియని వ్యక్తు లు అతడి బైకును అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వాగ్వాదం జరగడంతో వారు దీంతో శ్రీకాంత్‌పై ముక్కుముడిగా దాడి చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన శ్రీకాంత్‌ను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సెక్యూరిటీ గార్డు దారుణ హత్య
గచ్చిబౌలి: నిర్మాణంలో ఉన్న భవనంలో సెక్యూరిటీ గార్డు దారుణ హత్యకు గురైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మయూరి బిల్డింగ్స్‌లో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ హబీబుల్లాఖాన్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గచ్చిబౌలి సర్వే నెంబర్ 90/1లో ఓఆర్‌ఆర్ సర్కిల్‌లో నిర్మాణంలో ఉన్న మయూరి బిల్డింగ్‌లో మైక్రాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎలక్ట్రికల్ పనులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బేస్‌మెంట్ 3లో ఎలక్ట్రికల్ సామగ్రి స్టోర్ రూమ్ ఏర్పాటు చేశారు. జగద్గిరిగుట్టకు చెందిన దాసరి రాజు(59) అక్కడ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి డ్యూటీకి వచ్చిన అతను మంగవారం ఉదయంరక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించిన స్టోర్ ఇన్‌చార్జి అనిల్ డయల్ 100కు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఇనుప రాడ్డుతో రాజు తలపై కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు గుర్తించారు. సమీపంలోని సీసీ పుటేజీలను పరిశీలించగా గుర్తుతెలియని వ్యక్తి లోపలికి వె వెళ్లినట్లుగా గుర్తించారు. ఆటోలో వెళ్లిన అనుమానితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.