
ఫ్యూచర్‌సిటీతో మహర్దశ
యాచారం: ఫ్యూచర్‌సిటీతో యాచారానికి మహర్దశ పట్టనుందని, కాంగ్రెస్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విశ్వనగరం వైపే ప్రపంచ చూపు ఉందని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని కొత్తపల్లి, తక్కళ్లపల్లి, నస్దిక్‌సింగారం, అయ్యవారిగూడెం, యాచారం గ్రామాల్లో మంగళవారం ఆయన రూ. రెండున్నర కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ ఫార్మాసిటీ నిర్మించి ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేయాలని చూస్తే, సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఫ్యూచర్‌సిటీ నిర్మించి ప్రపంచస్థాయి గుర్తింపు పొందేలా కృషి చేస్తున్నా రని అన్నారు. అర్హులైన రైతులకు రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, అందులో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు ఈసీ శేఖర్‌గౌడ్, బిలకంటి చంద్రశేఖర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు మస్కు నర్సింహ, యాచారం మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్లు, మాజీ వైస్ ఎంపీపీలు రాంరెడ్డి, శ్రీనువాస్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి