
అస్తవ్యస్తంగా నిర్వహణ
శంకర్‌పల్లి: మున్సిపాలిటీలో డంపింగ్ యార్డు నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పట్టణంలో నిత్యం 12టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా ఎక్కడా తడి, పొడిగా వేరు చేయడం లేదు. మున్సిపాలిటీకి చెత్తను డంప్ చేయడానికి సరైన డంపింగ్ యార్డు లేదు. ఉన్నా దాంట్లో ఇష్టం వచ్చినట్టు చెత్త పడేయడం, గుర్తు తెలియని వ్యక్తులు అగ్గి వేసి వెళ్లడంతో నిరంతరం పొగలు వస్తూనే ఉంటాయి. సమీపంలోని కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫిర్యాదు చేస్తే ట్యాంకర్ల ద్వారా నీటిని చల్లి, పొగలను చల్లార్చుతున్నారు. ఇప్పటికై నా డంపింగ్ యార్డు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. కూరగాయల వ్యర్థాల ద్వారా నెలకి పది టన్నుల కంపోస్టు ఎరువును తయారు చేస్తున్నారు. మిగతా చెత్తను సైతం ఎరువుగా మార్చాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.