‘స్థానిక’ ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
కొత్తూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌గౌడ్ పిలుపునిచ్చారు. పట్టణంలోని ఓ మినీ ఫంక్షన్‌హాల్‌లో శనివారం నిర్వహించిన మండల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి రాజ్‌భూపాల్‌గౌడ్, అందెబాబయ్య, శ్రీవర్ధన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మోదీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతూ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్శిస్తుందన్నారు. ఈ ఘటన తర్వాత ప్రపంచంలోనే 4వ ఆర్థిక దేశంగా తయారు కావడం గొప్ప విషయమన్నారు. ఉగ్రవాద చర్యలతో దేశంలో అస్థిరత, ఘర్షణ, ఆర్థికంగా దెబ్బతీయాలని చూసిన పాకిస్తాన్‌కు మనసైన్యం తగిన గుణపాఠం చెప్పినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు అశోక్‌గౌడ్, మాణిక్యం, పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు
పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌గౌడ్


