అధికార, ప్రతిపక్షాలను వెనక్కి నెట్టేసాం
కందుకూరు: సర్పంచ్ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలను వెనక్కి నెట్టి బీజేపీ అత్యధిక స్థానాలు కై వసం చేసుకుందని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, పార్టీ పంచాయతీరాజ్ సెల్ కన్వీనర్ సాధ మల్లారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మ అంజిరెడ్డి అన్నారు. గురువారం వారు మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నో వ్యయప్రయాసలను ఎదుర్కొంటూ పోటీపడి గెలిచిన సర్పంచులకు శుభాకాంక్షలు చెప్పారు. అభ్యర్థుల విజయానికి అహర్నిశలు కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే ఒరవడిని భవిష్యత్‌లో జరిగే ఏ ఎన్నికలోనైనా కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యువమోర్చా నాయకుడు సామ మహేందర్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బొక్క సత్యనారాయణరెడ్డి, బొక్క సురేందర్‌రెడ్డి, సాధ ప్రవీణ్‌రెడ్డి, బొక్క పరశురాంరెడ్డి, కొత్తగూడ ఉప సర్పంచ్ ముచ్చర్ల రవీందర్, హనుమంతుల అరుణ్ పాల్గొన్నారు.


