మత్తుకు బానిసలు కావొద్దు
మొయినాబాద్: విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు బానిసలు కావొద్దని, జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలంగాణ యాంటీ నార్కొటిక్ బ్యూరో డీఎస్పీ సైదులు అన్నారు. మున్సిపల్ పరిధిలోని అజీజ్‌నగర్ రెవెన్యూలో ఉన్న కేఎల్‌హెచ్ యూనివర్సిటీలో గురువారం ఎన్‌ఎస్‌ఎస్ యూని ట్, తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో లైన్స్‌క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సహకారంతో మాదకద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వాడకం పబ్ సంస్కృతి, ఆన్‌లైన్ బెట్టింగ్ వంటి చెడు అలవాట్లకు దారితీస్తుందని అరు. కేసులు నమోదైతే విద్యార్థులు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు కోల్పోవాల్సి వస్తుందన్నారు. వృత్తిపరమైన అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. యువత, విద్యార్థులు మత్తుపదార్థాలకు దూరంగా ఉండి.. మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ రామకృష్ణ, అధ్యాపకులు మల్లేష్, చంద్రశేఖర్, వెంకటరాజు, భవానిసుష్మ, దీప్తి తదితరులు పాల్గొన్నారు.


