ఫాంహౌస్‌ల్లో వేడుకలకు అనుమతి తప్పనిసరి
మొయినాబాద్: ఫాంహౌస్‌ల్లో నిర్వహించే ఎలాంటి వేడుకలకైనా అనుమతులు తప్పని సరి తీసుకోవాలని రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతం అన్నారు. మున్సిపల్ కేంద్రంలోని అంజనాదేవి గార్డెన్‌లో శుక్రవారం ఫాంహౌస్ నిర్వాహకులు, యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేడుకల్లో లిక్కర్ వినియోగిస్తే ఎకై ్సజ్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. పార్టీల నిర్వహణకు ఫాంహౌస్‌లు ఇచ్చే ముందు అందరి వివరాలు నమోదు చేసుకోవాలని చెప్పారు. ఏమైనా సంఘటనలు జరిగినప్పుడు యజమానులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. లేదంటే సంఘటనకు కారణమైనవారితోపాటు యజమానులు, నిర్వాహకులపైనా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో చేవెళ్ల ఏసీపీ కిషన్, మొయినాబాద్ ఇన్‌స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి, ఎస్సైలు నర్సింహారావు, వెంకన్న, నయీమొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.


