నాలా ఆక్రమణల తొలగింపు | - | Sakshi
Sakshi News home page

నాలా ఆక్రమణల తొలగింపు

Jun 12 2025 11:02 AM | Updated on Jun 12 2025 11:02 AM

నాలా ఆక్రమణల తొలగింపు

నాలా ఆక్రమణల తొలగింపు

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నాలా విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. బుధవారం చింతలబస్తీలో నాలా ఆక్రమణలను హైడ్రా తొలగించింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12 వద్ద ఉన్న కల్వర్టుకు చింతలబస్తీ వైపు ఆక్రమణలు జరిగాయి. ఈ కల్వర్టుకు ఓవైపు 15 మీటర్ల వెడల్పుతో నాలా ఉండగా... చింతలబస్తీ వైపు 7 మీటర్ల మేర కబ్జా జరిగినట్టు నిర్ధారించిన అధికారులు ఆ ఆక్రమణలను తొలగించారు. ఇసుక, చిన్న సిమెంట్‌ దుకాణంతో పాటు కల్లు కాంపౌండ్‌ రేకుల షెడ్డు కూల్చేశారు. పింఛన్‌ ఆఫీసు వద్ద ఉన్న కల్వర్టును పూర్తి స్థాయిలో విస్తరించనున్నారు. శంకర్‌పల్లిలోని బుల్కాపూర్‌ చెరువు నుంచి మొదలైన ఈ నాలా నాగులపల్లి, పుప్పాలగూడ, మణికొండ, దర్గా, మెహిదీపట్నం, బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12, చింతలబస్తీ, తుమ్మలబస్తీ, హుస్సేన్‌సాగర్‌ మీదుగా వెళ్లే ఈ నాలా ద్వారా నీరు సాఫీగా సాగేందుకు హైడ్రా చర్యలు తీసుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement