
పంటల సాగులో అవగాహన తప్పనిసరి
యాచారం: ప్రభుత్వ గుర్తింపు కలిగిన దుకాణాల్లోనే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేయాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ అల్థాస్ జానయ్య అన్నారు. మండల పరిధిలోని మాల్ రైతు వేదికలో మంగళవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. పంటల సాగులో రైతులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించాలని, తక్కువ శ్రమతో అధిక దిగుబడి వచ్చే పంటలపై దృష్టి పెట్టాలని తెలిపారు. నీటి ప్రాముఖ్యత, వినియోగం సమర్థత, వరిలో వైవిధ్యీకరణ అవసరంపై తెలియజేశారు. వానాకాలం ప్రారంభం కాగానే ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురు రైతులకు మేలైన వివిధ రకాల విత్తనాలను ఉచితంగా అందించనున్నట్టు వెల్లడించారు. రైతులు అవగాహన పొంపొందించుకోవడానికి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం ఎంతో దోహదపడుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు శ్రీనివాస్, రామకృష్ణబాబు, సునీత, ఇబ్రహీంపట్నం ఏడీఏ సుజాత, యాచారం మండల వ్యవసాయాధికారి రవినాథ్, పీఏసీఎస్ చైర్మన్ తోటిరెడ్డి రాజేందర్‌రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.
ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి
షాబాద్: ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తామని ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు గందె సురేష్‌గుప్తా పేర్కొన్నారు. మండల కేంద్రంలో మంగళవారం సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంఘంలో సభ్యత్వం లేని వారు నూతనంగా నమోదు చేయించుకోవాలని తెలిపారు. వృద్ధాప్య భృతి కోసం 60 ఏళ్ల పైబడిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆర్యవైశ్యులకు సంఘం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు దండు రాహుల్‌గుప్తా, ట్రెజరర్ నీల రవీందర్‌గుప్తా, జిల్లా కార్యదర్శి చొక్కంపేట రాకేష్ గుప్తా, షాబాద్, ఫరూఖ్‌నగర్ మండలాల అధ్యక్షులు పాపిశెట్టి సాయిరాంగుప్తా, నారాయణ, మెంబర్‌షిప్ కమిటీ చైర్మన్ మలిపెద్ది శ్రీనివాసులు, ఫరూఖ్‌నగర్ మండల మాజీ అధ్యక్షుడు మురళి, సంఘం సభ్యులు గడ్డం రమేష్‌గుప్తా, ఉప్పు శ్రీనివాస్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లను
వేగిరం చేయండి
ఆమనగల్లు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులకు మంజూరైన ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి సూచించారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాల అధికారులంతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు వెంటనే ప్రొసీడింగ్స్ అందించాలన్నారు. ఈనెల 25లోపు ఇళ్ల నిర్మాణానికి మార్కింగ్ ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఎప్పటికప్పుడు బిల్లులు గ్రౌండింగ్ చేయాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ కుసుమమాధురి, మున్సిపల్ కమిషనర్ శంకర్‌నాయక్, హౌసింగ్ డీఈ సురేశ్, ఎంపీఓ వినోద, ఏఈ అభిషేక్ పాల్గొన్నారు.
నేడు ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన
మున్సిపల్ పరిధిలోని సంకటోనిపల్లి, మండల పరిధిలోని సీతారాంనగర్‌తండాలో బుధ వారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శంకర్‌నాయక్, ఎంపీడీఓ కుసుమమాధురి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శంకుస్థాపన చేస్తారని, అనంతరం లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వు పత్రాలు పంపిణీ చేస్తారని తెలిపారు.

పంటల సాగులో అవగాహన తప్పనిసరి