
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
మహేశ్వరం: ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని రాచకొండ సీపీ సుధీర్‌బాబు పేర్కొన్నారు. మండల పరిధిలోని తుమ్మలూరు మ్యాక్ ప్రాజెక్టులో బీటీఆర్ విల్లాస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 320 ఐపీ సీసీ కెమెరాలను మంగళవారం ఆయన మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా సీపీ మాట్లాడుతూ.. విల్లాస్, అపార్ట్‌మెంట్లు, కాలనీలు, గ్రామాల్లో నేరాలను అరికట్టడానికి సీసీ కెమెరాలు ఎంతోగానో దోహదపడతాయని తెలిపారు. వీటితో కేసుల పరిష్కారం సులభతరం అవుతుందని, నేర శోధన, నేర నివారణకు ఎంతగానో తోడ్పడతాయని ఆయన వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ బీవీ సత్యనారాయణ, మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి, సీఐలు వెంకటేశ్వర్లు, గురువారెడ్డి, మ్యాక్ బీటీఆర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎస్.ప్రతాప్‌రెడ్డి, కోశాధికారి నాదేళ్ల రాఘవేందర్, జాయింట్ సేక్రటరీ డా.కె.అనిల్‌కుమార్, సభ్యులు తదిత రులు పాల్గొన్నారు.
రాచకొండ సీపీ సుధీర్‌బాబు