
చర్యలు తీసుకుంటున్నాం..
విజయవాడ జాతీయ రహదారిపై వేగనియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వనస్థలిపురం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ భూపతి గట్టుమల్లు పేర్కొన్నారు. పాదచారుల సౌకర్యార్థం విజయవాడ జాతీయ రహదారిపై పలు ప్రాంతాల్లో ఎఫ్‌ఓబీలు ఏర్పాటు చేయాలని జీహెచ్‌సీఎంసీ, జాతీయ రహదారుల సంస్థకు లేఖలు రాశామని హయత్‌నగర్ వర్డ్‌అండ్‌డీడ్ దగ్గర ఫుట్ ఓవర్‌బ్రిడ్జి పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. హయత్‌నగర్‌లోని భాగ్యలతకాలనీ దగ్గర కూడా ఫుట్ ఓవర్‌బ్రిడ్జిని నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయని పలు కారణాలతో పనులు జరగడం లేదన్నారు. పాదచారులు రోడ్డు దాటేలా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తామన్నారు.