
కడ్తాల్‌లో సినిమా షూటింగ్
కడ్తాల్: సినిమా బృందం సభ్యులు కడ్తాల్‌లో సందడి చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మాతలుగా, పి.మహేశ్‌బాబు దర్శకత్వంలో హీరో రామ్ నటిస్తున్న ఓ సినిమాకు సంబంధించిన పలు సన్నివేశాలను సోమవారం మండల కేంద్రంలో చిత్రీకరించారు. స్థానిక శ్రీనివాస థియేటర్ ఆవరణలో దర్శకుడు మహేశ్‌బాబు పర్యవేక్షణలో నటీనటులపై చిత్రీకరణ చేశారు. కడ్తాల్‌లో సినిమా షూటింగ్ జరుగుతుండటంతో సినీ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆసక్తిగా తిలకించారు.
కూలీ డబ్బుల కోసం ఫోన్ చేసినందుకు..
ప్లంబర్‌ను చితకబాదిన కాంట్రాక్టర్
బంజారాహిల్స్: తనకు రావాల్సిన కూలీ డబ్బుల కోసం ఓ ప్లంబర్ తాను పని చేస్తున్న కాంట్రాక్టర్‌కు తరచూ ఫోన్ చేయడంతో ఆగ్రహం పట్టలేని కాంట్రాక్టర్ సదరు ప్లంబర్‌ను దారికాసి చితకబాదిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–13లోని శ్రీరామ్‌నగర్ బస్తీకి ఆశిష్‌కుమార్ దాల్ ప్లంబర్‌గా పని చేస్తున్నాడు. కొంతకాలంగా అతను జూబ్లీహిల్స్‌కు చెందిన అరుణ్‌కుమార్‌నాయక్ అనే కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నాడు. ఈ నెల 17న తనకు రెండు రోజుల భత్యం రావాలంటూ పలుమార్లు అరుణ్‌కుమార్‌కు ఫోన్ చేశాడు. దీంతో ఆగ్రహానికి లోనైన అరుణ్‌కుమార్ బైక్‌పై వెళుతున్న ఆశిష్‌కుమార్‌ను అడ్డగించి తనకు అన్నిసార్లు ఎందుకు ఫోన్ చేస్తున్నావంటూ అతడిపై దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితుడి ఎడమ చేయి వేలు విరిగిపోయింది. బాధితుడి పిర్యాదు మేరకు పోలీసులు అరుణ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నకిలీ నోట్ల
మార్పిడీకి యత్నం
నిందితుడి రిమాండ్
కుత్బుల్లాపూర్: నకిలీ నోట్లు అంటగట్టి ఓ మహిళను మోసం చేసిన వ్యక్తిని పేట్‌బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిరిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన మనీషా సావంత్ తనకు పరిచయస్తుడైన చత్తీస్‌ఘడ్ ప్రాంతానికి చెందిన కుంజురామ్ పటేల్‌కు రూ.18.5 లక్షలు ఆన్‌లైన్‌లో బదిలీ చేసింది. మనీషాకు ఇవ్వాల్సిన డబ్బులు నగదు రూపంలో ఇస్తానని, పేట్‌బషీరాబాద్‌లోని పాంటలూన్స్ షోరూమ్ వద్దకు రమ్మని చెప్పాడు. కుంజురామ్ ఆమెకు నకిలీ నోట్లు అంటగట్టేందుకు యత్నిస్తుండగా గుర్తించిన మనీషా అతడిని నిలదీసింది. దీంతో కుంజురామ్ అతని అనుచరులు అక్కడి నుంచి పరారయ్యారు. తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కుంజురామ్, అతడి అనుచరులను అదుపులోకి తీసుకుని సోమవారం మేడ్చల్ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు.

కడ్తాల్‌లో సినిమా షూటింగ్