
హిందూ ధర్మ పరిరక్షణకు కృషి
షాద్‌నగర్: హిందూ ధర్మ పరిరక్షణ కోసం అందరూ కృషి చేయాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని వెలిజర్ల గ్రామంలో రామాలయం, శివాలయం ప్రారంభోత్సవాలను వైభవంగా నిర్వహించారు. గత మూడు రోజులుగా బొడ్రాయి, విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమాల చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఎంపీ డీకే అరుణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. హిందూ ధర్మాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలన్నారు. అదేవిధంగా గ్రామ దేవతలను పూజించడం అనాదిగా వస్తున్న ఆచారమన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి, అందెబాబయ్య, పార్టీ పట్టణ అధ్యక్షుడు హరిభూషణ్, నాయకులు సుధాకర్‌రావు, వంశీకృష్ణ, మురళీ, వెంకటేష్, మోహన్‌సింగ్, శ్యాంసుందర్, బాల్‌రాజ్, శ్రీనివాస్, లష్కర్ నాయక్, రంగయ్యగౌడ్, రాజు, అశోక్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ