గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

May 19 2025 7:59 AM | Updated on May 19 2025 7:59 AM

గీత క

గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

మొయినాబాద్‌: గీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని గౌడ కుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రేనట్ల మల్లేష్‌గౌడ్‌ కోరారు. ఈ మేరకు ఆదివారం నగరంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ను కలిసి విన్నవించారు. రాష్ట్రంలో గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన ఆయన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గౌడ కుల పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు.

పిడుగుపాటుకు

పాడి గేదెలు మృతి

కందుకూరు: పిడుగుపాటుతో మూడు పాడి పశువులు మృతి చెందాయి. ఈ సంఘటన మండల పరిధి రాచులూరులో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నల్ల కలమ్మ పాడి పశువులతో కుటుంబాన్ని పోషించుకుంటుంది. రోజులాగే పొలం వద్ద చెట్టు కింద నాలుగు గేదెలను కట్టేసింది. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో పాటు, పశువుల సమీపాన పిడుగు పడటంతో మూడు మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. వాటి విలువ సుమారు రూ.3 లక్షల వరకు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు కోరుతోంది.

శంకర్‌పల్లివాసులకు

దళితరత్న అవార్డులు

శంకర్‌పల్లి: పట్టణానికి చెందిన కడమంచి మల్లేశ్‌, తూర్పాటి నరసింహ దళితరత్న అవార్డులు దక్కించుకున్నారు. ఈ మేరకు వారు ఆదివారం హైదరాబాద్‌లో బెడ బుడగ జంగం వ్యవస్థాపక అధ్యక్షుడు చింతల రాజలింగం, అంబేడ్కర్‌ ఉత్సవాల కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రాజన్న సమక్షంలో అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళితుల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు శంకర్‌, తిరుమల హరి, లక్ష్మయ్య, శ్రీను, శివ, చంద్రయ్య, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

నిశ్చితార్థ వేడుకకు సీఎం, మంత్రులు, ప్రముఖులు

శంకర్‌పల్లి: జన్వాడ శివారులోని నియో కన్వెన్షన్‌లో ఆదివారం సాయంత్రం నార్సింగి ఏసీపీ రమణగౌడ్‌ కుమారుడు పవన్‌రాజ్‌, సాయిశృతి నిశ్చితార్థ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న జంటను ఆశీర్వదించారు. నార్సింగి ఏసీపీ రమణగౌడ్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ బావబావమరుదులు అవుతారు. నిశ్చితార్థ వేడుకలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

గీత కార్మికుల  సమస్యలు పరిష్కరించాలి 1
1/2

గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

గీత కార్మికుల  సమస్యలు పరిష్కరించాలి 2
2/2

గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement